Covid-19: Telangana forms four panels to execute vaccination

#Telangana
#Covid19
#Vaccine
#Covid19vaccine
#Kcr
#Hyderabad

కరోనా టీకా పంపిణీకి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకు టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటుచేసింది. టీకా పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని నియమించింది. టీకా వేయడానికి ముందు, వేసే సమయంలో, ఆ తర్వాత ఆయా కమిటీలకు విధివిధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు